సంప్రదాయ చీరకట్టు... పడతుల సొగసులదిరేట్టు - chirakattu photos
చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో అంటూ ఓ గేయ రచయిత చీరకట్టు సొగసులను చూపించాడు. నేటి సమాజంలో ఎన్నో రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నా చీరలో ఉన్న సౌందర్యం, సౌకర్యం వేటిలోనూ లభించదు. తెలంగాణ గ్రామీణప్రాంత మహిళల చీరకట్టు వస్త్రధారణను తెలిపే విధంగా గోచికట్టు పేరుతో హైదరాబాద్ మణికొండలో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నెలరోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణ వనితలను సాంప్రదాయ చిత్రమాలిక ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Last Updated : Mar 31, 2019, 3:11 PM IST