PRATHIDHWANI: గణపతి నవరాత్రులు ఇస్తున్న సందేశం ఏంటి?
PRATHIDHWANI: విఘ్నాలు తొలగాలి.. విజయాలు కలగాలి...! ఇదే కోరికతో ఊరువాడ అంతా.. ఆ విఘ్నాధిపతి ఉత్సవాల్లో నిమగ్నం అయింది. దేవుళ్లలో ప్రథముడు, ప్రధానుడైన.. ఆ లంబోదరుడి విగ్రహాల కోలాహలమే ఎక్కడ చూసినా. ఇప్పుడనే కాదు.. ఏ పని ప్రారంభించే ముందైనా మనందరి తొలి పూజ ఆ వినాయకుడికే. అసలు వినాయకుడు విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడు? ఈ గణపతి నవరాత్రుల సందేశం ఏమిటి? ఆ ఉండ్రాలయ్యకు గణాధిపత్యం ఎలా లభించింది? గణేష ఆరాధన ఎందుకింత సుప్రసిద్ధం అయింది? ఈ పర్వదినం పరమార్థం... ప్రకృతితో ఆ ఏకదంతుడికి ఉన్న అనుబంధాన్ని మనం సరిగానే అర్థం చేసుకుంటున్నామా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.