ఘనంగా శునకం బర్త్‌డే సెలబ్రేషన్స్.. కేక్ కటింగ్.. అందరికీ స్పెషల్ డిన్నర్! - ఘనంగా కుక్క పుట్టినరోజు వేడుకలు
Dog Birthday Celebrations: పెంపుడు కుక్కలపై యజమానులకు ప్రేమ సహజమే. వాటిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపుర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. జిల్లాలోని బన్వారిపుర్లో నివాసం ఉంటున్న సురేశ్ కుమార్ బింద్.. తన పెంపుడు కుక్క రాణి ఐదో పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరిపాడు. శునకంతో కేక్ కట్ చేయించి.. స్థానికులు, బంధుమిత్రులకు స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. బర్త్‌డే పార్టీకి వచ్చిన చిన్నారులంతా డీజే పాటలకు డ్యాన్స్‌లు చేసి అలరించారు. ప్రస్తుతం ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో రాణి బర్త్‌డే సెలబ్రేషన్స్ హాట్ టాపిక్‌గా మారింది.