ప్రతిధ్వని: బాటిళ్లు, బబుల్స్‌లో అమ్ముతున్నది మినరల్ వాటరేనా?
మినరల్ వాటర్ స్వచ్ఛమైన తాగునీటికి ఒక చిరునామా. ప్రజల్లో బలంగా ఏర్పడిన ఈ నమ్మకమే ఇపుడు వాటర్ ప్లాంట్లు, నీళ్ల వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. కానీ ఆ క్రమంలో బీఐఎస్ ప్రమాణాలు, ఐఏఎస్ మార్కుల నిబంధనలు గాలికి వదిలేయడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణ బోరు నీటిని నామమాత్రంగా శుద్ధి చేసి మినరల్ వాటర్ పేరుతో అమ్మేస్తున్నారు. వాటర్ ప్లాంట్లలో తాగునీటి ప్రాసెసింగ్, నీటి నిల్వ, సరఫరా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ సాధిస్తున్న మినరల్ నీటి వ్యాపారంపై ప్రభుత్వ నియంత్రణ ఎంత? ఈ అంశంపై నేటి ప్రతిధ్వని.