చెస్ ఒలింపియాడ్ స్పెషల్.. ఈ 'చదరంగం' వంతెనను చూశారా? - తమిళనాడు
తమిళనాడులో ఓ వంతెన చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చదరంగం బోర్డు తరహాలో నలుపు, తెలుపు గడుల సమాహారంతో ముస్తాబు చేసిన మహాబలిపురం నేపియర్ వంతెన కనువిందు చేస్తోంది. ఈనెల 28వ తేదీ నుంచి మహాబలిపురంలో 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నేపియర్ వంతెనను చెస్ బోర్డు తరహాలో తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. "భారతదేశ చెస్ రాజధాని చెన్నై గ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్ చెస్ బోర్డులా ముస్తాబైంది" అంటూ రాసుకొచ్చారు.