వెంకటేశ్ మూవీ షూటింగ్ నుంచి పారిపోయిన అంజలి.. డూప్‌తో మేనేజ్! - నటి అంజలి మాచర్ల నియోజకవర్గం
Actress Anjali: అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది నటి అంజలి. సినిమాల్లో హీరోయిన్, కీలక పాత్రల్లోనే కాదు.. ప్రత్యేక గీతాల్లోనూ ఆడిపాడుతోంది. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్‌కు సంబంధించి పలు విషయాలను తెలిపింది. చిత్రసీమలో తనకెదురైన ఒడిదొడుకుల వల్ల ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు చెప్పింది. పది సినిమాలు చేయడం కన్నా కంటెంట్ ఉన్న ఓ చిత్రం చేస్తే చాలని చెప్పింది. ఓ సందర్భంలో హీరో వెంకటేశ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ సెట్ నుంచి ఎవరికీ చెప్పకుండా పారిపోయినట్లు తెలిపింది. మరి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎక్కడికి వెళ్లింది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..