tirumala: తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి సర్వభూపాల వాహన సేవ - శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నాలుగోరోజు రాత్రి శ్రీదేవి, భూదేవులతో మలయప్పస్వామి స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని కీర్తిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు.