Prathidhwani:ప్రాణం నిలిపే టీకాలపై ఇంకా భయమెందుకు?
ఒకవైపు కరోనా విలయ విషాదం. మరొకవైపు వ్యాక్సిన్లపై వీడని సంశయం. విషయం అక్కడితోనే అయిపోలేదు. జ్వరం వస్తుందని కొందరు.. మాకు దాంతో పనిలేదని ఇంకొందరు.. ఈ రోజు తిథి మంచిది కాదని, శుభముహుర్తాలు లేవని మరికొందరు. ఇలా అపోహలతో, అనవసర భయాలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి సంకోచిస్తున్నారు. కాకపోతే ఇన్ని ఆలోచిస్తున్న వాళ్లు వ్యాక్సిన్ తప్ప కొవిడ్ నుంచి కాపాడే సురక్షా కవచం మరొకటి లేదని గుర్తించలేక పోతున్నారు. నేటికీ దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ ముందుకు సాగకపోవటానికి అది కూడా ఒకానొక కారణం. అసలు వ్యాక్సిన్ పట్ల వారికి ఉన్న భయాలలో వాస్తవాలెంత? వ్యాక్సిన్ ఎంత సురక్షితం? వ్యాక్సిన్ వేసుకోవటంలో చేసే జాప్యం ఎంతటి ప్రమాదం తెచ్చి పెడుతుంది? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.