తెలంగాణ

telangana

ETV Bharat / videos

prathidhwani: పౌరుల ప్రాథమిక హక్కులకు భద్రత లభించాలంటే ఏం చేయాలి?

By

Published : Aug 9, 2021, 10:04 PM IST

పోలీస్‌ స్టేషన్‌ పేరు ఎత్తగానే సామాన్యులకు గుండెలో దడ పుడుతుంది. విచారణల పేరుతో స్టేషన్లకు తీసుకెళ్లే నిందితులకైతే అవి యమకూపాలు గానే కనిపిస్తుంటాయి. పలకరింపు నుంచి పరిశోధన వరకూ ప్రశ్నలు, పరిశీలనలూ, సందేహాలు, విచారణ పేరుతో సాగే తంతులో సామాన్యుల గుండె బేజారై పోవాల్సిందే. పోలీస్‌ స్టేషన్​లో కాలుపెట్టిన దగ్గర నుంచి తిరిగి బయటకు నడిచే వరకూ పౌరుల హక్కులకు రక్షణ, మర్యాద లభిస్తుందన్న భరోసా కల్పించలేని పరిస్థితి. సమాజ రక్షకభట నిలయంలోనే పౌరుల హక్కులకు రక్షణ దొరుకుతుందన్న నమ్మకం ఎందుకు లేదు? నేర విచారణల సమయంలో పౌరులు, నిందితుల హక్కులపై చట్టాలు, కోర్టుల మార్గ దర్శకాలు ఏం చెబుతున్నాయి? పోలీస్‌ స్టేషన్లలో పౌరుల ప్రాథమిక హక్కులకు భద్రత లభించాలంటే ఏం చేయాలి? ఇదే అశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details