బడి నిండా బాలకృష్ణులే... - గోపిక
సికింద్రాబాద్ తుకారం గేట్ షిరిడీ సాయిబాబా హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలతో అలరించారు. గోపాలుడి పాటలకు పిల్లలు నృత్యాలు చేస్తూ అందరిని అబ్బురపరిచారు. పాఠశాలలో బాలకృష్ణుడి వేషధారణతో ఆకట్టుకున్నారు. చిన్నారి గోపికల మధ్య చిన్ని కృష్ణులు ఉట్టి కొట్టారు. పాఠశాల వాతావరణమంతా కోలాహలంతో నిండింది.
Last Updated : Aug 25, 2019, 2:57 PM IST