చేప మందు వేసుకుంటారా...? - చేప ప్రసాదం
మృగశిర కార్తె ఆరంభం కాగానే ఆస్తమా రోగులు భాగ్యనగరంవైపు చూస్తారు. దేశం నలుమూలల నుంచి చేప మందు కోసం హైదరాబాద్కు చేరుకుంటారు. చేప ప్రసాదం... భాగ్యనగరానికే సొంతమైన ఆయుర్వేద... ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఔషధం. ఏటా మృగశిర కార్తె తొలి రోజున బత్తిని సోదరులు పంపిణీ చేసే ఈ మందును ఉబ్బసం వ్యాధి నివారణకు మంచి ఔషధంగా భావిస్తారు. మృగశిర నుంచి వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. గాలిలో తేమ శాతం పెరిగి ఆస్తమా వ్యాధిగ్రస్తులపై ప్రభావం పడుతుంది. అందువల్ల ఈ మందును పంపిణీ చేస్తారు.