Ganapati Immersion Dance: గణపతి నిమజ్జన శోభాయాత్రలో సందడే సందడి.. - హైదరాబాద్ తాజా వార్తలు
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. డీజే పాటలతో.. తీన్మాన్ డప్పులతో.. యువతీ యువకుల స్టెప్పులతో.. చిన్నారుల డ్యాన్సులతో.. బాణాసంచా.. పూల రథాలు.. వరుణుడి చిరుజల్లుల పలకరింపులతో శోభాయాత్ర కన్నుల పండువగా ముందుకెళ్తోంది. అడుగడుగునా ఎదురయ్యే రకరకాల గణపతులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు... గణపయ్య సామ్రాజ్యంగా మారింది. నిమజ్జన వేడుకచూసేందుకొచ్చిం సందర్శకులు, పార్వతీ తనయుడిని గంగమ్మ ఒడిగి సాగనంపేందుకొచ్చిన ఉత్సవ కమిటీలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. గణపతి నామస్మరణతో నగరం మార్మోగిపోతోంది. శోభాయాత్ర సందర్భంగా రోడ్లన్నీ రంగులు, పూలు వెదజల్లి.. పూల మార్గాలుగా మారాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న గణపయ్యను.. ఘనంగా సాగనంపుతున్నారు. మీ మొక్కులు, కష్టాలు, సుఖ, సంతోషాలు అన్నీ దగ్గరుండి చూశాను.. వాటన్నింటిని తీర్చి.. మళ్లీ ఏడాది మరింత ఉత్సాహంగా మీ చెంతకు వస్తానంటూ బైబై చెప్పి .. గణపయ్య గంగమ్మ ఒడికి చేరుతున్నాడు.