'చిరంజీవిని చూస్తూ డైలాగ్ మర్చిపోయా'
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన గాయని సునీత.. తొలినాళ్లలో డబ్బింగ్ చెప్పిన రోజుల్ని గుర్తుచేసుకుంది. 'చూడాలని ఉంది' సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం మర్చిపోలేనని చెప్పింది. ఆ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి వివరించింది.