'జాతీయ స్థాయి అథ్లెట్లతో 'సీటీమార్' షూటింగ్' - tamanna as kabaddi coach
తాను వినే ప్రతి కథను మరో హీరోతో ఊహించుకుంటానని అంటున్నారు హీరో గోపీచంద్. తను నటించిన 'సీటీమార్' కథను కూడా అలాగే విన్నానని చెబుతున్నారు. ఆయన హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ క్రీడా నేపథ్యంలో రూపొందిన చిత్రం 'సీటీమార్'. తమన్నా, భూమిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సీటీమార్ చిత్ర విశేషాలను పంచుకున్న గోపీచంద్.. ఈ సినిమాలో నలుగురు జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన అమ్మాయిలు నటించారని తెలిపారు.