hero movie: 'హీరో'ను చూసి ఆ రోజులను గుర్తుచేసుకున్న కృష్ణ! - మహేశ్‌బాబు మేనల్లుడి సినిమా
సరైన కథలు దొరకకపోవడం వల్లే అశోక్ కథానాయకుడిగా పరిచయం నాలుగేళ్లు ఆలస్యమైందని అశోక్ తల్లి, మహేశ్ బాబు సోదరి గల్లా పద్మావతి తెలిపారు. ఈ సంక్రాంతికి హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అశోక్.... మామకు తగిన అల్లుడు అనిపించుకున్నాడు. ఈ సందర్భంగా హీరో చిత్రానికి వస్తున్న ఆదరణ పట్ల పద్మావతి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈటీవీతో అశోక్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరో చిత్రంలోని పరిచయం సన్నివేశాలకు సంబంధించి జోర్డాన్ లో చిత్రీకరణ చేశామని, మొదట్లో బడ్జెట్ ఎక్కువవుతుందని వద్దనుకున్నా... ఇప్పుడు అవే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయని పద్మావతి తెలిపారు. తమ నిర్మాణ సంస్థలోనే కాకుండా ఇతర సంస్థల్లోనూ అశోక్ కు హీరోగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాడని ఆమె వెల్లడించారు. హీరో చిత్రం విజయవంతం కావడం పట్ల సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబులతోపాటు ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు.
Last Updated : Jan 16, 2022, 5:55 PM IST