మా మధ్య ఎలాంటి గొడవలు లేవు: మోహన్‌బాబు - చిరంజీవి-మోహన్‌బాబు
చిరంజీవికి తనకు ఎలాంటి విభేదాలు లేవని నటుడు మోహన్‌బాబు అన్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ-2020.. ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరం ఒకేచోట కలిస్తే ఛలోక్తులు విసురుకుంటామంతేనని.. నా కుటుంబమే ఆయన కుటుంబమని, ఆయన కుటుంబమే తన కుటుంబమని అన్నాడు. భగవంతుడి సాక్షిగా తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజం కానీ తామిద్దరం మాత్రం ఎప్పటికీ ఒక్కటేనని అన్నాడు.