ఓటు హక్కు వినియోగించుకున్న అల్లుఅర్జున్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశాడు. అనంతరం మాట్లాడిన బన్నీ... "ఓటు హక్కు వినియోగించుకోవడం మన కర్తవ్యం.ఇది మన భవిష్యత్తు, బాధ్యత. ఓటు వేసే వారికే అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి" అని ప్రజలకు పిలుపునిచ్చాడు.