తెలంగాణ

telangana

Yoga Day special 2023

ETV Bharat / videos

Yoga Day special 2023 : 6150 మీటర్లు ఎత్తులో.. మైనస్​ 15 డిగ్రీల్లో.. యోగాసనాలు - యోగా డే థీమ్​ 2023

By

Published : Jun 21, 2023, 2:41 PM IST

Yoga on Mountain video : ఆత్మస్థైర్యం, పట్టుదలతో యువత ముందుకు సాగితే సాధ్యం కానిది ఏం లేదని చెప్పిన స్వామి వివేకానంద మాటలను నిజం చేస్తున్నాడు ఓ యువకుడు. ఏకంగా శిఖరాలపైనే యోగాసనాలు వేసి అందరితోటి మన్ననలు పొందుతున్నాడు. ఆ యువకుడి పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన ప్రవీణ్​ చిన్నతనం నుంచి యోగాసనాలు వేయడం అలవాటుగా నేర్చుకున్నాడు. నేపాల్​లోని 6150 మీటర్ల ఎత్తు ఉన్న మేర పర్వతంపై 108 సూర్య నమస్కారాలు చేశాడు. 

ఇదే విధంగా శీతల ప్రదేశమైన మౌంట్​ ఎవరెస్ట్​ బేస్​ క్యాంపుపై మైనస్​ 15 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 108 సూర్య నమస్కారాలు చేశాడు. దీంతో పాటు 21 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి.. ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు ఈ యువకుడు 8 దేశాల్లో 21 ఎత్తైన పర్వతాలపై 108 సూర్య నమస్కారాలు చేసి.. అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం యూనివర్సిటీలో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details