తెలంగాణ

telangana

Womens Reaction on Freebus Service in Jagtial

ETV Bharat / videos

ఉచిత ప్రయాణ సౌకర్యం - మహిళలతో కిటకిటలాడుతున్న బస్సులు - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 3:54 PM IST

Updated : Dec 10, 2023, 7:22 PM IST

Womens Reaction on Freebus Service in Jagtial :ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. అతివలకు ఉచితమనే హామీతో ప్రయాణం సులభమవుతుందని ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉపయోగమని ప్రయాణికులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సంస్థకు లోటు ఏర్పడినప్పటికీ ఇచ్చిన హామీని నేరవేర్చడం సంతోషకరమని మహిళాలోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది.

Mahalakshmi Scheme in Telangana : మహాలక్ష్మీ పథకంతో జగిత్యాల జిల్లా మహిళల్లో ఆనందం పరవశిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ పథకం అందరి నుంచి ప్రశంసలనందుకుంటోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేద, మధ్యతరగతి మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పరిశీలిస్తే కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల డిపోల పరిధిలో మహిళా ప్రయాణికుల రద్దీ నెలకొంది. పుణ్యక్షేత్రాలు, పెళ్లిలు, ఇతర అవసరాలకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. నిన్నటి నుంచి మహిళల రద్దీ పెరిగిందని జగిత్యాల డిపో అసిస్టెంట్​ మేనేజర్​ హిమబిందు తెలిపారు. సోమవారం నుంచి విద్యార్థులతో మరింత రద్దీ పెరగనుందని పేర్కొన్నారు.

Last Updated : Dec 10, 2023, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details