Prathidwani : కన్నడ తీర్పు.. కాంగ్రెస్‌ను హస్తినలో నిలుపుతుందా..!
Congress Party Victory In Karnataka Today Prathidwani : కర్ణాటక హస్తగతమైంది. హిమాచల్ తర్వాత మరో రాష్ట్రం బీజేపీ చేయి జారింది. కింగ్‌మేకర్ కావాలన్న జేడీఎస్ ఆశ అడియాసే అయింది. మఠాలు, మతాలు ప్రభావితం చేయలేదు. కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు పని చేయలేదు. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ మార్పు కోరాయి. అదే తీర్పు ఇచ్చాయి.
కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో అనేకమంది సీనియర్లు వీడిపోతున్న తరుణంలో, రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేసిన నేపథ్యంలో ఈ విజయం కాంగ్రెస్‌కి కొత్త ఊపిరి నిచ్చింది. బీజేపీ వ్యతిరేక కూటమికి ఊపు నిచ్చింది. ఈ పరాజయం దక్షిణాదిన విస్తరించాలన్న కాషాయ దళానికి ఊసురో అనిపించింది. అయితే ఈ జయాపజయాల ప్రభావం కర్ణాటకే పరిమితమా? మోదీ-షా ద్వయం ఓటమిని అంత తేలిగ్గా తీసుకుంటుందా? విజయాన్ని విస్తరించుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి? సందేశాలేంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.