తెలంగాణ

telangana

Villa Marie College Navaratri Celebrations

ETV Bharat / videos

Villa Marie College Navaratri Celebrations : విల్లామేరీలో ముందస్తు నవరాత్రి వేడుకలు.. దాండియాతో విద్యార్థినుల ఆటాపాటా - Villa Marie College

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 7:50 PM IST

Villa Marie College Navaratri Celebrations : సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో నవరాత్రి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు దాండియా ఆటలు, కోలాటం నృత్యాలతో అదరగొట్టారు. మినీ నవరాత్రి, రంగీలా రాస్‌ పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థినులు ఆడి, పాడి కేరింతలు కొట్టారు. కాలేజీ మైదానంలో తొలిసారి ముందస్తు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడంపై విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.

Navaratri Celebrations in Hyderabad :అనాథ పిల్లలకు ఆర్థిక సాయం కోసం ఫుడ్ కోర్ట్స్, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థినులు మంచి రుచికరమైన ఆహారపు రుచులను ఆరగిస్తూ.. ఆస్వాదించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆటలు ఆడుతుంటే చెప్పలేనంత సంతోషంగా కలుగుతోందన్నారు. గర్భా, దాండియాతో పాటు డీజే నిర్వహించడం మరింత ఆనందం కలిగించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల ఆట, పాటలతో కళాశాల ప్రాంగణమంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఈ వేడుకల్లో కళాశాల డైరెక్టర్‌ ఫిలోమినా, కార్యదర్శి చిన్నమ్మ, ప్రిన్సిపల్‌ రేవతి దేవి మాథుర్‌ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details