పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పుంజుకుంటుందని ఆశిస్తున్నాను : వికాస్ రాజ్ - Vikash Raj on Telangana Election Polling
Published : Nov 30, 2023, 2:47 PM IST
Vikash Raj on Telangana Election Polling : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని.. సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతం జరుగుతోందని.. పట్టణ ప్రాంతాల్లోనూ పోలింగ్ పుంజుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ(Polling Process in Telangana) కొనసాగుతోందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకు ఓటింగ్ వేయవచ్చని.. మిగిలిన చోట ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Telangana Assembly Elections polling 2023 : ఓటు వేసే వ్యక్తి దగ్గర గుర్తింపు కార్డు లేకపోతే.. ఈసీ తెలిపిన 12 కార్డుల్లో ఏదొకటి చూపించి వేయవచ్చని వికాస్‌రాజ్ సూచించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో స్వల్ప ఉద్రిక్తతలు జరిగాయని.. వెంటనే అదుపు చేశామని అన్నారు. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత(FIR on MLC Kavitha) ప్రచారం చేశారని ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో కవితపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైనట్లు వెల్లడించారు. మరికొన్ని ఫిర్యాదులను కూడా డీఈవోలకు పంపామని స్పష్టం చేశారు.