110కి.మీ వేగంతో వెళ్తున్న రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. ప్లాట్‌ఫామ్‌పై ఈడ్చుకెళ్లి..
110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి జారిపడ్డాడు ఓ ప్రయాణికుడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ రైల్వే స్టేషన్లో జరిగింది. సుమారు 100 మీటర్ల మేర ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుడిని ఈడ్చుకెళ్లింది పాట్లీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ ప్రమాదంలో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి సురక్షితంగా బయట పడడం వల్ల ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు
అంతకుముందు ఒడిశాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి కింద పడిపోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడిని కాపాడాడు. ఈ ఘటన ఒడిశాలోని బ్రహ్మపుర రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. అసోంకు చెందిన జయేశ్(34) అనే యువకుడు వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. అప్పుడు అదుపు తప్పి కింద పడిపోయాడు. రైలు కిందకు జారిపోతున్న జయేశ్‌ను అక్కడే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సూర్యకాంత్ సాహు రక్షించాడు. జయేశ్.. బ్రహ్మపురలో ప్యాసింజర్ రైలు దిగి చెన్నైకు మరో రైలులో వెళ్లేందుకు ఇలా చేశాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.