మోదీ ముసుగుతో రోడ్డుపై వినూత్న నిరసన చేసిన విశ్రాంత సైనికుడు - భాగ్పథ్ రోడ్డు నిరసన
ఉత్తర్ప్రదేశ్లో ఓ మాజీ సైనికుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఖేక్డాకు చెందిన విశ్రాంత సైనికుడు సుభాష్ చంద్ కశ్యప్ అనే వ్యక్తి తన నిరసనను జాతీయ రహదారిపై వింతగా తెలియజేశారు. ఓ చేతిలో లాంతర్, మోదీ ముసుగు పట్టుకుని ఖేక్డా నుంచి గజియాబాద్ వరకు దాదాపు 30 కిలోమీటర్లు కాలి నడకన గుంతలు లేని రోడ్డు వెతుక్కుంటూ వెళ్లారు. దిల్లీ సహాన్పుర్ జాతీయ రహదారికి గత కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. దీని వల్ల రోడ్డుపై మొత్తం గుంతలు ఏర్పడ్డాయి. ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఆయన గతంలో లోక్సభ ఎన్నికల్లోనూ పోటీచేశారు. అయితే బాగ్పథ్ రోడ్ల విషయంలో మోదీ చెప్పిన మాటలు ఇక్కడ జరగడం లేదని సుభాష్ ఆరోపించారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST