తెలంగాణ

telangana

vande bharat train ganesh idol

ETV Bharat / videos

Vande Bharat Train Ganesh Idol : వందేభారత్​ రైలు నమూనాలో గణేశుడు.. 'మేక్​ ఇన్ ఇండియా' స్ఫూర్తితో..

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 11:12 AM IST

Vande Bharat Train Ganesh Idol :దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు భక్తులు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ముంబయిలో వందేభారత్ రైలు నమూనాలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. రైలును తలపించే ఈ మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రైలు పట్టాలపై వందేభారత్ ఉన్నట్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ గణేశుడు కొలువై ఉన్న ఈ రైలును ఎక్కేందుకు రూ.2,505 రూపాయలను టిక్కెట్ ధరగా చెల్లించాలి భక్తులు. కాగా.. ఈ ట్రైన్​లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో సైతం ఉంది. అచ్చం వందేభారత్ రైలు ఎలా ఉంటుందో అలాగే ఈ మండపాన్ని రూపొందించారు నిర్వహకులు. ఈ వందేభారత్ రైలును చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా.. మేక్​ ఇన్ ఇండియా స్ఫూర్తితోనే ఇలా వందేభారత్ రైలులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు డిజైనర్​ దీపక్ మక్వానా తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలా విభిన్నమైన థీమ్​లతో గణేశుడి విగ్రహాన్ని పెడుతున్నామని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details