తెలంగాణ

telangana

ఉత్తరాఖండ్ రాంనగర్​లో వరదలో చిక్కుకున్న బస్సు 27 మంది సేఫ్​

ETV Bharat / videos

ఉప్పొంగిన నాలాలో చిక్కుకున్న బస్సు.. 27 మంది..

By

Published : Mar 31, 2023, 8:27 PM IST

ఉత్తరాఖండ్​లో ఎడితెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నైనితాల్‌ జిల్లాలోని రాంనగర్​ పట్టణంలో ఓ నాలా ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న 27 మంది ప్రయాణికులతో కూడిన ఓ బస్సు అదుపు తప్పి కాలువ నీటి ప్రవాహంలో చిక్కుకుంది. బస్సులో ఉన్న వారు కేకలు వేయడం వల్ల అక్కడే ఉన్న కొందరు స్థానికులు అప్రమత్తమయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కకు ఒరిగిపోయిన బస్సు పైకి ఎక్కి మరి బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమంలో కాపాడేందుకు బస్సు ఎక్కిన గ్రామస్థుల మధ్య చిన్న తోపులాట కూడా జరిగింది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం రాంనగర్‌ నుంచి డోన్‌ పరేవాకు 27 మంది ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. సరిగ్గా రాంనగర్​ తిల్​మఠ్​ ఆలయం సమీపంలోకి రాగానే నీటి ఉద్ధృతి పెరగడం వల్ల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. ఇకపోతే రాంనగర్​లోనే కాకుండా చుట్టుపక్కల నాలాలు కూడా భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు రాంనగర్​ పట్టణానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణిస్తున్నారని.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక తహసీల్దార్ విపిన్ చంద్ర పంత్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details