తెలంగాణ

telangana

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ETV Bharat / videos

Kishan Reddy respond: 'మణిపుర్ యువత హింసను పక్కన పెట్టి ప్రభుత్వానికి సహకరించాలి' - మణిపూర్ గొడవ

By

Published : May 7, 2023, 9:37 PM IST

Kishan Reddy respond: హింస వదిలి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మణిపుర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆందోళనల ద్వారా ప్రజా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతాయని తెలిపారు. మణిపుర్​లో అభివృద్ధి కోసం కేంద్రం రూ.5,500కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య భారతంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మణిపుర్ యువత హింసను పక్కన పెట్టి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ నుంచి రాష్ట్ర విద్యార్థులను ప్రభుత్వం తరలిస్తోంది. 250 మంది రాష్ట్ర విద్యార్థులను మణిపుర్‌ నుంచి తీసుకువస్తోంది. ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్‌ వచ్చారు. ప్రత్యేక విమానం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంది. అటు మణిపుర్‌ ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఏపీ విద్యార్థులు 70 మంది వరకు చిక్కుకున్నారు. తెలంగాణ విద్యార్థులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో తీసుకు వస్తున్నారని.. ఏపీ ప్రభుత్వం ఎటువంటి  చర్యలు చేపట్లేదని ఏపీ  విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details