TS PRATHIDHWANI: అప్పుల్లో రూ.19 వేల కోట్లు కేంద్రం కోత పెట్టడాన్ని ఎలా చూడాలి? - కేంద్రం 19వేల కోట్ల రూపాయల కోత
TS PRATHIDHWANI: ఆర్ధిక క్రమశిక్షణా... రాజకీయ సాధింపులా...? తెలంగాణ రాష్ట్ర వార్షిక రుణపరిమితిలో ఏకంగా 19వేల కోట్ల రూపాయలకు కేంద్రం కోత పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇదే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాతావరణం వాడీవేడీగా మారింది. ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనల అమలు .. కార్పొరేషన్ అప్పులు కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తేవడం వల్లనే పరిమితి తగ్గిందని కేంద్రం స్పష్టం చేస్తోంది. కానీ కొద్దిరోజులు నెలకొన్న పరిస్థితుల ప్రకారం చూస్తే అలా అనుకోలేం అంటున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వవర్గాలు. అసలు... రాష్ట్రం అడిగిన అప్పులు ఎంత? అందుకు కేంద్రప్రభుత్వం చెబుతున్న పరిమితులు ఏమిటి? భాజపాయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష అన్న విమర్శలకు ఇది బలచేకూర్చుతుందా? నిజంగా రాష్ట్రాల ఆర్ధికనిర్వహణను గాడిన పెట్టడానికే ఈ చర్యలా..? ఇదే అంశంపై ఇవాళ ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST