తెలంగాణ

telangana

ETV Bharat / videos

వేల అడుగులు ఎత్తయిన కొండపై ట్రాక్టర్​ స్టంట్స్​.. వీడియో వైరల్​ - కేదార్​నాథ్​ యాత్ర

By

Published : May 11, 2022, 2:35 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ఉత్తరాఖండ్​ చార్​ధామ్​ యాత్రలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్​నాథ్​ దర్శనానికి ఎత్తైన గుట్టలను దాటుకుని వెళ్లాలి. వాహనాలు వెళ్లేందుకు సరైన దారి ఉండదు. అయితే, కొందరు మినీ ట్రాక్టర్​ను నడకదారిలో తీసుకెళ్లారు. ప్రమాదకరమై ఈ దారిలో ట్రాక్టర్​ను తీసుకెళ్తున్న దృశ్యాలు వైరల్​గా మారాయి. రెండేళ్ల క్రితం సైతం ఇలాగే ఓ ట్రాక్టర్​ వీడియో వైరల్​గా మారగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి మళ్లీ నడకదారిలో నిర్మాణ సామగ్రితో నిండి ఉన్న ట్రాక్టర్​ను తీసుకురావటంపై పర్యటకులు విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కోసారి ట్రాక్టర్​ ఇంజిన్​పై పలువురు కూర్చుని ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయితే.. వస్తువులను తరలించేందుకు మాత్రమే అన్ని జాగ్రత్తలు తీసుకుని ట్రాక్టర్​కు అనుమతి ఇచ్చినట్లు జిల్లా పాలనాధికారి దీక్షిత్​ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details