Prathidwani : ప్రాణాంతకంగా మారుతున్న నాలాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు
Published : Sep 4, 2023, 9:08 PM IST
Prathidwani Debate on Open Caping NALAS in Hyderabad : భాగ్యనగరాన్ని నాలాల భయం వీడడం లేదు. గత కొంతకాలంగా నాలాల వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల సంభవిస్తున్న మరణాలతో.. ఎప్పటికప్పుడు చర్చ జరిగేలా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీనగర్ నాలాలో.. లక్ష్మి అనే మహిళ ఆదివారం గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిందని భావిస్తున్న పరిసర ప్రాంతాల నుంచి సుమారు.. పది కిలోమీటర్ల మేర హుస్సేన్‌సాగర్ సర్ప్రైస్ నాలా, మూసీలో.. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
NALAS in GHMC :మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి మహిళా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు 24 గంటలైనా అధికారులు లక్ష్మి ఆచూకీని గుర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు.. హైదరాబాద్ మహానగరంలో నాలాల నిర్వహణ ఎలా ఉంది? ఈ రోజుకి కూడా ఓపెన్ నాలాల వద్ద మనుషుల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి రావడం దేనికి సంకేతం? హైదరాబాద్ మహానగర పరిధిలో ఓపెన్ నాలాల క్యాపింగ్, మొత్తం డ్రైనేజీ వ్యవస్థను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడంలో ఎక్కడ ఉన్నాం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.