తెలంగాణ

telangana

Prathidwani Debate on Cyber Crime in Telangana

ETV Bharat / videos

కొత్త సర్కార్​- సైబర్​ నేరాలపై నజర్​ - government actions on cyber crime

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 9:29 PM IST

Prathidwani Debate on Cyber Crime in Telangana : తాళాలు, బీరువాలు పగులగొట్టి లూటీ చేయడం, దారి కాచి దోపిడీలు పాత పద్దతి! ఇప్పుడంతా కొత్తపంథా. ఎక్కడివాళ్లు అక్కడే ఉంటారు. మూసిన తలుపులు మూసినట్లే ఉంటాయి. వేసిన తాళాలు అన్నీ అలానే ఉంటాయి. కానీ ఖాతాల్లో సొమ్మే క్షణాల వ్యవధిలో మాయం అవుతుంది. సైబర్‌ బూచోళ్లు(Cyber Criminals in Telangana) చూపిస్తున్న కొత్త నేర కథా చిత్రం ఇది. వేలాది కేసులు బాధితులు నష్టపోతున్న కోట్లాది రూపాయలు సమస్య తీవ్రతకు సాక్ష్యంగా నిలుస్తోంది. 

Government Actions on Cyber Crime :సైబర్‌ నేరాల్లో 90% ఆర్థిక నేరాలే ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిన రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకూ ప్రయత్నాలు మొదలు పెట్టింది కొత్త సర్కార్. అందుకు అనుగుణంగానే పోలీసులు చర్యలు ప్రారంభించారు. మరి సైబర్ నేరాలపై ఎలాంటి ప్రణాళికలు ఉంటే మేలు?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details