సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
PRATHIDWANI: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకు 6 సార్లు ఎన్నికలు జరిగితే.. ఏఐటీయూసీ 3, టీజీబీజీకేఎస్ 2, ఐఎన్‌టీయూసీ ఒకసారి విజయం సాధించాయి. ఈసారి గెలుపు ఎవరిదనే అంచనాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. సింగరేణిలో మొత్తం 32 వరకు కార్మిక సంఘాలు ఉన్నాయి. తెలంగాణలో 6 జిల్లాల్లో రాజకీయాలను ప్రభావితం చేసేలా.. సింగరేణి ఎన్నికల ఫలితాలు.
ఏప్రిల్ 2వ తేదీనే షెడ్యుల్ విడుదల అన్న సంకేతాలతో కార్మిక సంఘాలు, నాయకులంతా తమ తమ ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయారు. కార్మికుల్లో పట్టుకోసం.. సంఘాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కీలక సమయం కావడంతో సింగరేణి కార్మికుల సమస్యలు కూడా తెరపైకి తెచ్చి.. పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తామని హామీలు ఇస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత జరగనున్న సింగరేణి సమరంలో ఎవరి అవకాశాలెలా ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న రానున్న సింగరేణి పోరు ఫలితాలు ఎవరికి ఎందుకు కీలకం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.