తెలంగాణ

telangana

Taekwondo Championship in Yadadri

ETV Bharat / videos

Taekwondo Championship in Yadadri : భువనగిరిలో ఘనంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 8:53 PM IST

Taekwondo Tournament in Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లాలో 8వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో వీటిని ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో 80 మంది తైక్వాండో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Taekwondo Competition in Yadadri District : విద్యార్థులు ప్రత్యర్థులను కాలిత్ కిక్ చేస్తూ.. తన యాక్షన్ స్కిల్స్​ను ప్రదర్శించారు. చిన్నారుల నుంచి సీనియర్ల వరకు నిర్వహించిన పోటీలు ఆహుతులను అబ్బుర పరిచారు. పోటాపోటీగా జరిగిన ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తైక్వాండో మాస్టర్లు కృష్ణ, రాధా, పరమేష్​ తో పాటు ఇతర మాస్టర్లు పాల్గొన్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఇలాంటి విద్యలు నేర్చుకోవడం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్​లో ప్రవేశం ఉంటే తమను తాము రక్షించుకోవడమే కాకుండా పోకిరీలకు బుద్ధి కూడా చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details