తెలంగాణ

telangana

Students_Boat_Stucked_in_between_Pulicat_Lake

ETV Bharat / videos

Students Boat Stucked in between Pulicat Lake: పులికాట్‌ సరస్సులో మొరాయించిన విద్యార్థుల పడవ.. రెండున్నర గంటల తర్వాత..! - పులికాట్‌ సరస్సులో మొరాయించిన విద్యార్థుల పడవ

By

Published : Aug 11, 2023, 7:41 AM IST

Students Boat Stucked in between Pulicat Lake: పులికాట్‌ సరస్సులో చిమ్మచీకట్లో పడవలో చిక్కుకుపోయిన 60 మంది విద్యార్థులను.. మరో పడవలో వెళ్లి ఒడ్డుకు చేర్చిన ఘటన తిరుపతి జిల్లా తడ మండలంలో చోటుచేసుకుంది. ఇరకం దీవి విద్యార్థుల పడవ గురువారం సాయంత్రం పులికాట్​ సరస్సు మధ్యలో మొరాయించింది. ఇరకం నుంచి విద్యార్థులు ప్రతిరోజూ తమిళనాడు పరిధిలోని సున్నాంబుగోళం తమిళ పాఠశాలకు పడవలో రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం దీవి నుంచి పాఠశాలకు పడవలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వల తగులుకోవడంతో పడవ మొరాయించింది. పడవ నడిపే వ్యక్తి వద్ద ఫోన్​ లేకపోవడంతో దీవికి సమాచారం చేరలేదు. సాయంత్రం 6గంటలలోపు ఒడ్డుకు చేరుకోవాల్సిన విద్యార్థులు జాడ లేకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు మరో పడవలో సున్నాంబుగోళం బయలుదేరారు. అప్పటికే చీకటి పడటంతో దాదాపు 60 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మొరాయించిన పడవ వద్దకు చేరుకుని విద్యార్థులను మరో దానిలో ఎక్కించుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details