స్నేక్ క్యాచర్ నాగేంద్ర జంతుప్రేమ ఇంట్లో 11 పాము గుడ్లను పొదిగించి - 11 గుడ్లను పెంచిన స్నేక్ క్యాచర్
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన నాగేంద్ర అనే స్నేక్ క్యాచర్ జంతువుల పట్ల ప్రేమను చూపించాడు. అతడి తోటలో రెండునెలల క్రితం ఓ పాము మొత్తం 11 గుడ్లను పెట్టింది. తల్లి పామును అడవిలో వదిలిన నాగేంద్ర దాని గుడ్లను మాత్రం భద్రపరిచాడు. సురక్షితమైన వాతావరణంలో వాటిని జాగ్రత్తగా ఉంచాడు. సుమారు 75 రోజుల తర్వాత అవి పొదిగాయి. త్వరలోనే పాము పిల్లలను అడవిలో విడిచిపెడతానని నాగేంద్ర తెలిపాడు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST