ప్రజలు మార్పు కోరుకుంటున్నారు - ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది : రాబర్ట్ వాద్రా - తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2023
Published : Dec 1, 2023, 10:49 PM IST
Robert Vadra Visits Nizamabad : సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నిజామాబాద్ నగరంలో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ హనుమాన్ ఆలయం, జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో గల మసీదులను దర్శించుకున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నగరంలోని బాల సదన్‌లో అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేసి వారితో సరదాగా గడిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గాంధీ కుటుంబంతోనే దేశానికి భద్రత ప్రజలకు భవిష్యత్ ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని రాబర్ట్ వాద్రా అన్నారు.
Telangana Elections Exit polls 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక తుది తీర్పే తరువాయి. డిసెంబరు మూడో తేదీన ప్రజా తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో అన్ని ఎగ్డిట్ పోల్స్(Exit Polls 2023) సర్వేలు రాష్ట్రంలో అధికారం దక్కించుకునేది.. కాంగ్రెస్ పార్టీనే అని ముక్తకంఠంతో చెబుతున్నాయి.