ఆటో ఎక్కిన రాహుల్ గాంధీ.. యూసఫ్‌గూడలో అజారుద్దీన్‌తో ఆటోలో చిట్‌చాట్ - హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ఎన్నికిల ప్రచారం
Published : Nov 28, 2023, 3:08 PM IST
|Updated : Nov 28, 2023, 8:30 PM IST
Rahul Gandhi Travelled in Auto in Hyderabad : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో ఇవాళ చివరి రోజున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో అధిక శాతంలో పనులు చేస్తున్న ఆటో వర్కర్స్ యూనియన్‌తో పాటు, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్లతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌తో కలిసి యూసఫ్‌గూడలో ఆటోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ ఆటోలో కనిపించేసరికి ఆయన్ను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారు. నగరంలో ఎన్నికల ప్రచారం, పార్టీ బలబలాలపై అజారుద్దీన్‌తో ఆటోలో చర్చిస్తూ రాహుల్ గాంధీ కనిపించారు. మధ్యాహ్నం రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంక గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి మల్కాజ్‌గిరిలో రోడ్ షోలో పాల్గొంటారు.