తెలంగాణ

telangana

రెడ్యానాయక్ కు నిరసన సెగ

ETV Bharat / videos

Protest Against MLA Redyanaik : డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు నిరసన సెగ - డోర్నకల్ మండలం వార్తలు

By

Published : Jun 20, 2023, 2:21 PM IST

Protest Against MLA Redyanaik in mahabubabad : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు నిరసన సెగ తాకింది. మరిపెడ మండలం అబ్బాయిపాలెం, గాలివారిగూడెం గ్రామాలతో పాటు తండాల్లోనూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే బతుకమ్మ ఎత్తుకొని పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అబ్బాయిపాలెం నుంచి వెళ్తున్న క్రమంలో గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి ఎమ్మెల్యే కారుకు అడ్డుగా వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ... గ్రామస్థులు తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళ్లారు. ఊహించని ఈ ఘటనతో బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. అనంతరం జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని కోరారు.     

ABOUT THE AUTHOR

...view details