Prathidwani : రాష్ట్రంలో మళ్లీ హడలు పుట్టిస్తున్న డ్రగ్స్ దందా.. చరమగీతం పాడేదెప్పుడు..? - తెలంగాణలో డ్రగ్స్ దారుణాలపై ప్రతిధ్వని
Published : Sep 2, 2023, 9:59 PM IST
Prathidwani : రాష్ట్రంలో మత్తు ముఠాల ఆగడాలు ఏమాత్రం ఆగడం లేదు. ఒకటి క్లియర్ అయిందని అనుకుంటే.. మరొక అలజడి రేగుతూ కలవరం కలిగిస్తున్నాయి పరిణామాలు. క్రమం తప్పని రేవ్ పార్టీలు, భారీగా పట్టుబడుతున్న మత్తు పదార్థాలే సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. నషా ముక్త తెలంగాణ, మత్తు రహిత హైదరాబాద్ కోసం ఎంతోకాలంగా జరుగుతున్న ప్రయత్నాలకు పెను సవాల్‌గా నిలుస్తున్నాయి ఇప్పటి ఈ పరిణామాలు. రాష్ట్రంలో అసలు ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ఎందుకు ఎప్పటికప్పుడు డ్రగ్స్ కేసులు బయటపడుతున్నాయి.
Drugs Cases Increasing in Hyderabad : మరి మత్తు ముఠాలకు అంత తెగింపు ఎక్కడి నుంచి వస్తోంది? ఎప్పటికప్పుడు రెక్కలు నరుకుతున్నా.. కొత్తదారుల్లో ఎలా చెలరేగి పోతున్నారు? సమాజంలో కలవరం కలిగిస్తున్న డ్రగ్స్ మాఫియా(Drug mafia) కార్యకలాపాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయకపోతే రేపటి తరం పరిస్థితి ఏమిటి? యువతను ఆ మార్గం నుంచి బయటకు తీసుకురావాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.