రాష్ట్ర వ్యవసాయరంగంలో కీలకంగా ఉన్న కౌలు రైతుల గుర్తింపు ఎలా?
Published : Jan 2, 2024, 10:36 PM IST
Prathidwani : రాష్ట్రంలో కౌలు రైతులకు గుర్తింపునివ్వడం ఎలా? వారి అర్థాయుషు జీవితాలకు ఒక భరోసా ఇచ్చేందుకు ఏం చేయాలి? చాలాకాలంగా తెలంగాణ సమాజం, వ్యవసాయ రంగ మేధావులు, ప్రభుత్వం ముందున్న సవాల్ ఇది. ఈ పరిస్థితుల్లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్(Congress Government) కౌలు రైతుల కష్టాలపై దృష్టి పెట్టింది. సర్కారు అందించే ఎలాంటి పథకాలు వర్తించకున్నా, సబ్సిడీలు, ఉచిత పథకాలు, పంట నష్టపోతే పరిహారం రాకున్నా కష్టాల సేద్యాన్నే నమ్ముకున్న వారి కన్నీళ్లు తుడిచేందుకు చిత్తశుద్ధితో ఉన్నామంటున్నారు.
Debate on Kaulu Rythulu in Telangana: ప్రస్తుతం ప్రజాపాలనలో భాగంగా గ్రామసభల్లో కౌలురైతుల గుర్తింపు కోసం కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరి వారిని ఆదుకునే చర్యలు ఎలా ఉంటే మేలు? గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు. వారి గుర్తింపు విషయంలో ఎందుకింత సంక్లిష్టంగా మారింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.