Prathidwani : కొత్త ఆహార భద్రత కార్డులు ఎప్పుడు?
Prathidwani : మానవుడి ప్రాథమిక అవసరాలలో కూడు, గూడు, గుడ్డ ముఖ్యమైంది. ఇవి లేకుండా మనుగడ ఉండదు. ప్రాథమిక అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కరోనా కాలంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత తిండి గింజలతో ఎంతో మంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా అందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరుకాలేవు. రాష్ట్రంలో కొత్త ఆహార భద్రత కార్డులు ఎప్పుడు వస్తాయోనని.. ఎంతోమంది పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. అదిగో వస్తున్నాయి.. ఇదిగో అంటున్న ప్రభుత్వ గడువుల మధ్యనే భారమైన నిరీక్షణల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఎదురుచూపులు మరీ ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల వారే ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. 2016 తర్వాత.. కొత్త కార్డులు మంజూరు చేయక ఏళ్లు గడుస్తోంది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత బియ్యం కోల్పోవడంతో పాటు పలు రకాల సంక్షేమ పథకాలు వారికి దక్కడం లేదు. రాష్ట్రంలో ఎందుకీ పరిస్థితి? ఆహారభద్రత కార్డుల కోసం ప్రజలు సుదీర్ఘంగా ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.