prathidhwani: ఐటీపై చంద్రబాబు హయానికి, ఇప్పటికీ ఉన్నతేడాలు...
Published : Sep 16, 2023, 10:11 PM IST
prathidhwani: చంద్రబాబును అరెస్టు చేస్తే... హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని ఐటీ కారిడార్‌ల్లో వేలాది గొంతుకలు ఎందుకు నినదిస్తున్నాయి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చంద్రబాబుకు ఏమిటి సంబంధం? పాతికేళ్లైనా చంద్రబాబు ఐటీ సేవలను సమాజం మరిచి పోలేక పోతుందా? ఎందుకు ఆయన విజనరీ అయ్యారు? చంద్రబాబు వంటి హైటెక్ నాయకుడున్న ఆంధ్ర రాష్ట్రం నుంచి... ఈ రోజు యువత ఐటీ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస పోవాల్సి వస్తోంది? చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా అనేక దేశాల్లో నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ఈ అక్రమ అరెస్టు ప్రభావం భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉంటుంది? చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక నవ్యాంధ్రలో ఆర్టీజీఎస్ ద్వారా పాలనలో టెక్నాలజీ విప్లవాన్ని తీసుకుని వచ్చారు. దేశంలోని ఎందరో ప్రముఖులు దానిని సందర్శించి అభినందించారు. చంద్రబాబును ఐటీ రంగానికి అంత ప్రత్యేకంగా నిలిపిన అంశాలు ఏమిటి? ఈ రోజు దాని పరిస్థితి ఎలా ఉంది? ఇదీ నేటి ప్రతిధ్వని.