Ponguleti fires on KCR : "కేసీఆర్.. రైతులను ఎందుకు కోటీశ్వరులను చేయడం లేదు" - KCR
Ponguleti Srinivas Reddy fires on BRS : వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదించానని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలో రైతులందరిని కోటీశ్వరులను ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావుని.. ఆయన స్వగృహంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్‌గా పదవికి నియమించినందుకు ఏఐసీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
క్యాప్సికం పండించడం ద్వారా ఎకరానికి 10 కోట్లు ఆదాయం సంపాదించవచ్చని చెప్పిన కేసీఆర్.. రాష్ట్ర రైతులను ఎందుకు కోటీశ్వరులను చేయలేకపోయారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి ఎడ్లకు, వడ్లకు తేడా తెలియదని విమర్శించిన కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. భారత్ జోడోయాత్రలో రాహుల్‌గాంధీ రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారన్నారు. ఉచిత కరెంట్ సరఫరా కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పును, తెలంగాణ ప్రజల ఆకాంక్షను.. కాంగ్రెస్ పార్టీ గెలిపించి సోనియాగాంధీకి గిఫ్టుగా అందించే క్రమంలో నా వంతు కృషి చేస్తానని పొంగులేటి తెలిపారు.