ఓటు హక్కు వినియోగంపై విశ్రాంత ఉద్యోగుల మనోగతం - People Suggestions to Election Commission
Published : Nov 29, 2023, 6:57 PM IST
Officials Opinion On Telangana Assembly Elections 2023 : పాలకులను ప్రశ్నించాలంటే సరైన విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు పలువురు విశ్రాంత ఉద్యోగులు. ఓటు వేసి నాయకుడ్ని తప్పుపట్టడం కంటే.. జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని ఓటు వేయడం మంచిదంటున్నారు. ఎన్నికల సంఘం కూడా ఓటింగ్ శాతాన్నిపెంచేందుకు ఓటు హక్కును ఆధార్‌తో అనుసంధానం లాంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతున్నారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వాలు, నాయకులపై విశ్వాసనం సన్నగిల్లడం వల్లే యువత చాలా వరకు ఓటింగ్ దూరంగా ఉంటున్నారని అన్నారు.
People Suggestions to Election Commission : అభ్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా.. ప్రజా సమస్యలను తీర్చే నాయకులను ఎన్నుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓటర్ స్లిప్‌లలో కూడా పేర్లు సరిగ్గా లేదని విమర్శించారు. ఒకే పేరు రెండు పోలింగ్ కేంద్రాల్లో ఉందని.. అలాంటి సమస్యలు రాకుండా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజా సమస్యల తెలిసి, వాటిని పరిష్కరించే నాయకులనే ఎన్నుకోవాలని కోరుతున్న వనస్థలిపురం విశ్రాంత ఉద్యోగులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.