పెంపుడు శునకంపై చిరుత దాడి.. కాపాడేందుకు యజమాని సాహసం - చిరుత దాడి వీడియో
మహారాష్ట్ర పుణె జిల్లాలో ఇటీవల చిరుత పులుల సంచారం అధికమైంది. తాజాగా స్థానికంగా ఉన్న ఓ ఫాంహౌస్‌లోకి చొరబడింది. అక్కడ ఉన్న కుక్క.. చిరుతపైకి దూసుకెళ్లింది. దీంతో చిరుత దాడి చేసింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. శునకం అరుపులు విన్న యజమాని మదన్ కాకడే.. దాన్ని కాపాడేందుకు సాహసం చేశాడు. చిరుతను తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ వన్యమృగం మాత్రం కుక్కను విడిచిపెట్టలేదు. గొంతుకొరికి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం చిరుత పారిపోయింది. ఈ క్రమంలో కుక్క చనిపోయింది. శునకంపై ఇదివరకే చిరుత రెండుసార్లు దాడి చేసింది. అందుకే దాని మెడ చుట్టూ ఇనుప ముళ్లు ఉన్న బెల్టును అమర్చారు. అయినప్పటికీ శునకం తప్పించుకోలేకపోయింది. కాకడే పెంచుకున్న మరో శునకం సైతం గతంలో చిరుత చేతిలో ప్రాణాలు కోల్పోయింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST