తెలంగాణ

telangana

Old Man Rides Bicycle 14 KM

ETV Bharat / videos

తలపై చెరుకు గడలతో 14కి.మీ సైక్లింగ్- కూతురిపై ప్రేమతో పెద్దాయన సాహసం - చెరకుతో సైకిల్ తొక్కిన వృద్ధుడు

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 6:22 PM IST

Old Man Rides Bicycle Viral Video :తలపై చెరుకు గడలతో 14 కిలోమీటర్లు సైక్లింగ్​ చేశారు ఓ వృద్ధుడు. సంక్రాంతి పండుగ కానుకగా తన కుమార్తెకు చెరుకు గడలు ఇచ్చేందుకు ఈ సాహసం చేశారు తమిళనాడు పూదుకొట్టైకు చెందిన చెల్లాదురై. ముందుగా చెరుకు గడలు అన్నింటినీ కట్ట కట్టారు. కూతురి కోసం మరికొన్ని వస్తువులను సంచుల్లో పెట్టి, వాటిని సైకిల్​ క్యారేజ్​కు అమర్చారు. ప్రయాణం సాఫీగా సాగాలని సైకిల్​కు పూజ చేశారు. చెరుకు గడల కట్టను తలపై జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్​ ఎక్కారు. సైకిల్​పై దూసుకెళ్తున్న పెద్దాయనను చూసి ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యపోయారు. కొందరు బైక్స్​పై పక్కనే ప్రయాణిస్తూ, ఆయనను ఉత్సాహపరిచారు.

సైకిల్​పై 5000 కిలోమీటర్లు - వృద్ధుడి సాహసం
5000 KM Cycling in 100 Days :ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు ఓ వృద్ధుడు. 63 ఏళ్ల వయసులో 5000 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు. 100 రోజుల్లోనే ఈ ఘనతను అందుకున్నారు. ఆ వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details