తెలంగాణ

telangana

Accident

ETV Bharat / videos

Old City Car Accident : పాతబస్తీలో కారు బీభత్సం.. వీడియో వైరల్ - తెలంగాణ వార్తలు

By

Published : Jul 14, 2023, 9:21 AM IST

Car Accident at OldCity : హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు ఆకతాయిల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా కొందరు ఆకతాయిలు బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మరికొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారి ఆట కట్టించడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. రాష్‌ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారికి, సీటు బెల్ట్‌ ధరించలేని వారికి ఫైన్‌లు విధించి, వారిపై చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ఉపయోగం లేకుండాపోతోంది. పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాల దృష్ట్యా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్‌ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చినా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.  

తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న ఆకతాయిలు అదుపు చేయలేక రెండు వాహనాల పైకి దూసుకెళ్లారు. ఈ ఘటన హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పై హుస్సేని అలం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details