డిపాజిటర్ల సొమ్ము రూ.20 లక్షలు నొక్కేసిన సబ్ పోస్ట్ మాస్టర్ - నాగార్జున సాగర్ లో సబ్ పోస్ట్ మాస్టర్ మోసం
Published : Dec 20, 2023, 7:06 PM IST
Nagarjuna Sagar Post Office Fraud :నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఫైలాన్ కాలనీలో ఉన్న సబ్‌పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాదారుల ఖాతాల్లో నగదు మాయం అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సబ్‌పోస్ట్ మాస్టర్‌గా పని చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి అక్కడి ఖాతాదారుల ఖాతాల్లో నగదును పక్క దారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. నేడు విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఒక్కొక్కరు తమ ఖాతాలను చెక్ చేసుకోవడంతో వారి ఖాతాలో ఉన్న నగదు మాయమైనట్లు గుర్తించారు. దాదాపు 20 లక్షల రూపాయలు దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలుసుకొని అతన్ని విధుల నుంచి తొలగించారు.
Sub Postmaster Fraud in Post Office : అధికారులు ఈనెల 16 నుంచి అతని స్థానంలో వేరొకరిని విధుల్లోకి తీసుకొచ్చారు. రోజు విషయం పొక్కడంతో ఖాతాదారులు పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అతనిపై గతంలో ఫిర్యాదు చేసినా పోస్టు ఆఫీస్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తమ నగదును మాయం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి, తమ నగదు తమకు ఇప్పించాలని ఖాతాదారులు కోరుతున్నారు.