తెలంగాణ

telangana

Mock Drill on Flood Defenses in Bhupalapally

ETV Bharat / videos

Mock Drill on Flood Defenses in Bhupalapally : వరదల సహాయ రక్షణ పద్ధతులపై మాక్​ డ్రిల్​ - Bhupalapally latest news

By

Published : Aug 9, 2023, 9:34 PM IST

Mock Drill on Flood Defenses in Bhupalapally : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రంలో  విపత్తు రక్షణ దళాలు ముంపు ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ పద్ధతులపై మాక్​ డ్రిల్​ నిర్వహించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రదర్శనను ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సత్వర స్పందన కల్గించే విధంగా 20 మంది సభ్యులతో మాక్ డ్రిల్​ను నిర్వహించారు. చెరువులో మునిగిపోతే ఎలా రక్షించాలో కళ్లకు కట్టినట్లు దళాలు చూపించాయి. వరదలో చిక్కుకున్నవారు ఏం చేయాలో కూడా చూపించారు. అనంతరం రక్షణ దళాలతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీలు బోటులో చెరువు మొత్తం తిరిగి వీక్షించారు. వరదల సహాయం కోసం సుమారు రూ.10 లక్షల విలువైన లైఫ్ జాకెట్లను తెప్పించామన్నారు. మోరంచ వాగు ఉద్ధృతితో గ్రామం మొత్తం కొట్టుకుపోయిందని ఇది ఊహించని పరిణామమని మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని కలెక్టర్ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details