జేబులో పేలిన మొబైల్ ఫోన్.. ఒక్కసారిగా మంటలు.. లైవ్ వీడియో చూశారా? - జేబులో పేలిన మొబైల్ ఫోన్
ఓ వృద్ధుడి జేబులో ఉన్న కీ ప్యాడ్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అనంతరం షర్ట్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన వృద్ధుడు ఫోన్ విసిరేసి.. చాకచక్యంగా తప్పించుకున్నాడు. మొబైల్‌ను కిందపడేసి మంటలను ఆర్పేశాడు. కేరళకు చెందిన ఇలియాస్(76) అనే వ్యక్తికి జేబులో ఈ ఫోన్ పేలింది. ఇలియాస్ ఓ హోటల్లో టీ తాగుతూ కూర్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
త్రిస్సూర్ జిల్లాలోని మరోట్టిచల్ ప్రాంతంలో గురువారం దాదాపు 10 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ఇలియాస్ తెలిపాడు. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాప్‌లో వెయ్యి రూపాయలకు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు అతడు వివరించాడు. సంవత్సరం కింద దాన్ని కొనుగోలు చేశానని ఇప్పటి వరకు ఎటువంటి ట్రబుల్ ఫోన్ ఇవ్వలేదని వెల్లడించాడు. ఘటనలో తనకు గాయాలు కాలేదని ఇలియాస్ పేర్కొన్నాడు. హోటల్లో ఉన్న సీసీటీవీల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం ఈ నెలలో ఇది మూడో సారి కావడం గమనార్హం.